పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దాలుగా తీవ్రమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), సీపీఐ(ఎమ్) (CPI-M)ఈసీ పుణ్యమాని ఒకే వేదికను పంచుకోనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక పోలింగ్ సవరణ (SIR) ప్రక్రియ విషయంలో ఎలక్షన్ కమిషన్ (EC) అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఈ రెండు పార్టీలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు లేదా సంబంధాలు లేకుండా దూరంగా ఉంటూ వచ్చాయి. అయితే శుక్రవారం మమతా బెనర్జీ, సీపీఐ(ఎమ్) జనరల్ సెక్రటరీ ఎం.ఎ. బేబీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతను, ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని వారు చర్చించారు.
అలాగే మమతా బెనర్జీ విపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా మాట్లాడి ‘ఇండియా’ కూటమి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం.ఎన్నికల సంఘం పరిణామాలపై చర్చించడానికి ‘ఇండియా’ కూటమి నాయకులతో పాటు ఇతర బిజెపియేతర పార్టీల నేతలకు ఎం.ఎ. బేబీ సెప్టెంబర్ 23న రాసిన లేఖకు స్పందనగానే మమతా బెనర్జీ ఈ ఫోన్ కాల్ చేశారు. బేబీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, దేశంలో నిజంగా ఒక “అసాధారణ పరిస్థితి” ఏర్పడిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన కథనం ఎంతో దిగ్భ్రాంతికరంగా ఉంది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితి ఇసిఐ విశ్వసనీయతను, మన ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేసింది. మేము లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల 13 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అని బేబీ తన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా ఈసీ తీసుకొచ్చిన SIR ప్రక్రియ రాజకీయ ప్రత్యర్థులను ఏకతాటికి తేవడానికి సాయపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:BB10:బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి

