ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి!

2
- Advertisement -

కేంద్ర మంత్రి, ఎన్డీయే కూటమి నేత జితన్ రామ్ మాంఝీ పార్లమెంట్‌లో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన పార్లమెంట్ సభ్యులకు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాముఖ్యత కలిగిన బిల్లులపై చర్చల సందర్భంగా SC, ST ఎంపీలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు.

హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధ్యక్షుడైన మాంఝీ …ఆగస్టు 5న మాంఝీ నివాసంలో జరిగిన ‘ఎన్డీయే ఎంపీల సమూహ సంవాద్ సమావేశం’లో ఈ అంశం చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ (ST రిజర్వ్‌డ్) నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్, ముఖ్యంగా మొదటిసారి గెలిచిన SC/ST ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం తగినంత లభించడం లేదని లేవనెత్తారు.

సెప్టెంబర్ 16 నాటి తన లేఖలో ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని మాంఝీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. “పార్లమెంట్‌లో తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ప్రతిఒక్కరికీ ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీల సమస్యలు, ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఇలాంటి చర్చా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మాంఝీ తెలిపారు.

Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి

- Advertisement -