హార్మూజ్ జలసంధి..ట్రంప్ జలసంధి!

1
- Advertisement -

ఇరాన్ 7 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అలాగే ‘హోర్ముజ్’ కొత్త మ్యాప్‌ను షేర్ చేస్తూ “ట్రంప్ స్ట్రెయిట్”గా వ్యాఖ్యనిస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు.

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి (UN) సాధారణ సమావేశాల సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు ఒక 7 రోజుల ప్రణాళికను అందించారు.

ఇరాన్ విధించిన షరతులు:

అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) తొలగించాలి.

ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించాలి.

లెబనాన్‌తో సహా ప్రాంతీయ పోరాటాల్లో కాల్పుల విరమణ అమలు చేయాలి.

అమెరికా స్థంభింపజేసిన ఇరాన్‌కు చెందిన దాదాపు $12 బిలియన్ల ఆస్తులను విడుదల చేయాలి.

ఈ షరతులకు అమెరికా అంగీకరిస్తే 7వ రోజు హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనపై స్పందించిన ట్రంప్, ఇరాన్ తమ డిమాండ్లను నెరవేరుస్తుందనే నమ్మకం లేదని సృష్టంచేశారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని సేకరించడానికి అనుమతించబోమని స్పష్టం చేస్తూ, ఇరాన్ లక్ష్యాలపై మళ్లీ వైమానిక దాడులు చేసే అవకాశం ఉందన్నారు.ట్రంప్ హోర్ముజ్ ప్రాంతాన్ని అమెరికా అదుపులోని భూభాగంగా లేదా “ట్రంప్ స్ట్రెయిట్”గా పేర్కొనడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధనం ద్వారా ఆ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉందని ఆయన సమర్థించుకున్నారు.

Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి

ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో అత్యంత కీలకమైన ఈ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -