NEET పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపడుతున్న నిరసనలపై గత కొన్ని రోజులుగా అధికార బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వమే చెక్ పెట్టింది. విద్యార్థుల ఆందోళనల వెనుక పాకిస్తాన్, చైనా వంటి విదేశీ శక్తుల హస్తం ఉందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఈ నిరసనల వెనుక ఎలాంటి విదేశీ శక్తులు కానీ, విదేశాల నుంచి వస్తున్న ఫండింగ్ కానీ లేవని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. జంతర్ మంతర్ వద్ద ఆందోళన బాట పట్టిన విద్యార్థులను ఉద్దేశించి పలువురు బీజేపీ నాయకులు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉందని భారత్లో అశాంతిని సృష్టించేందుకు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఫండింగ్ ఇస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా స్పష్టతతో ఆ వ్యాఖ్యలన్నీ పసలేనివని తేలిపోయింది. స్వయంగా సొంత ప్రభుత్వమే ఈ విషయాన్ని కొట్టిపారేయడంతో ఆ బీజేపీ నేతలకు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఇది విద్యార్థుల ఆందోళనను తక్కువ చేసి చూపేందుకు యత్నించిన నేతలకు సొంత ప్రభుత్వమే ఇచ్చిన చెంపపెట్టు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి శోభ
మరోవైపు విద్యార్థి సంఘాలు మరియు ప్రతిపక్షాలు ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై విదేశీ ముద్ర వేయడం దారుణమ…విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

