తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి శోభ

742
- Advertisement -

తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైష్ణోదేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భద్రాచలం, తిరుమల,వేములవాడ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీమహావిష్ణువు క్షీరాబ్దియందు శయనిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

హిందువులకు ఇది మహా పర్వదినం. ఈ రోజును శయనైకాదశి అని కూడా పిలుస్తారు. ఇవా ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు.

Also Read:తొలి ఏకాదశి విశిష్ఠత..

తొలి ఏకాదశి దినం, తర్వాత వచ్చే పండుగలకు బోణీ లాంటిది. నిష్ఠాపరులకు, సనాతన సాంప్రదాయాచరణాసుక్తులకు ఉపవాసదినం. ముఖ్యంగా విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనదిగా భావించబడుతున్నది.

తొలిఏకాదశికి విశిష్ట చరిత్ర ఉంది.శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరునికి శయనైకాదశి ప్రత్యేకతను వివరించినట్లు భవిష్యత్ పురాణాధారం. విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాతాళ లోకంలో బలి చక్రవర్తి ద్వారం వద్ద ఉండి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి వస్తారని పౌరాణిక కథనం.

Also Read:గుండెపోటుతో సింగర్ సాయిచంద్ మృతి..

- Advertisement -