నీట్,జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ మరియు వ్యవస్థీకృత మోసాలను అరికట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ దిశగా శుక్రవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో యాంటీ-పేపర్ లీక్ చట్టాన్ని మరింత కఠినతరం చేసే ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సుదీర్ఘ జైలు శిక్షలు, భారీ ఆర్థిక జరిమానాలు, కేసుల విచారణకు నిర్దిష్ట కాలపరిమితి విధింపు వంటి నిబంధనలను పరిశీలిస్తున్నారు.
పేపర్ లీక్ కేసులను త్వరగా తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, గరిష్టంగా ఒక ఏడాది లోపే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా గడువు విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న శిక్షల కంటే మరింత తీవ్రమైన జైలు శిక్షలు, జరిమానాలను అమలు చేసేలా సవరణలు చేయనున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల దీక్ష విరమణవిద్యా సంస్కరణలు, పోటీ పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆయనను కలిసి ప్రభుత్వ హామీలను వివరించారు.
పేపర్ లీకేజీలు, పరీక్షల సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.పరిహారం & కేసులు: NEET పేపర్ లీక్ వివాదం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించడంపై సానుకూలంగా ఉన్నామని, శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయబోమని జేపీ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సలహాలు పాటిస్తూ పాత ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని సూచించారు.ప్రస్తుత చట్టం ఏమి చెబుతోంది?మోదీ ప్రభుత్వం జూన్ 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024 ప్రకారం:సాధారణ నిందితులకు: 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 10 లక్షల వరకు జరిమానా. ఇప్పుడు రాబోయే నూతన సవరణల ద్వారా ఈ చట్టాన్ని మరింత పటిష్టం చేసి, లీకేజీ నెట్‌వర్క్‌లను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.
ALso Read:వైభవ్‌పై శ్రేయాస్ ప్రశంసలు

