బీహార్ మంత్రివర్గ విస్తరణ గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరుకానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిషాంత్ కుమార్ ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత, నిషాంత్ రాజకీయ అరంగేట్రం ఖరారైంది.
ఈ విస్తరణలో చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మరియు జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ప్రతినిధులకు కూడా చోటు దక్కనుంది.ప్రమాణ స్వీకారానికి ముందు పాట్నాలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.
అనుభవజ్ఞులైన, విద్యావంతులైన నాయకత్వంతో బీహార్ మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేకు లభించిన భారీ మెజారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని చెప్పారు.మంత్రివర్గంలోకి నిషాంత్ కుమార్‌ను ఆహ్వానించడం మంచి నిర్ణయమని ఆయన అభివర్ణించారు. “ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం.. రెండూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
ALso Read:‘ఇంపాక్ట్ ప్లేయర్’..రక్షణ కవచం మాత్రమేనా?
తొలుత పార్టీ కార్యకర్తగానే సేవ చేస్తానని, ఎటువంటి పదవులు వద్దని నిషాంత్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, జేడీయూ నాయకులు మరియు కార్యకర్తల బలమైన కోరిక మేరకు ఆయన ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించారు. నితీష్ కుమార్ 20 ఏళ్ల సుదీర్ఘ పాలన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిషాంత్ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది.ప్రస్తుతం పాట్నాలో ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీహార్ రాజకీయాల్లో ఈ మార్పులు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

