ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, తన మాజీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌లో అంతర్గత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో పని చేసే వాతావరణం చాలా విషపూరితంగా (Toxic) మారిందని రాఘవ్ చద్దా విమర్శించారు. అక్కడ గౌరవం లేదని, పని చేసే స్వేచ్ఛ కరువైందని ఆయన పేర్కొన్నారు.
తాను ఆప్ కార్యకలాపాలకు దూరం కావడానికి ప్రధాన కారణం, వారి తప్పుడు పనుల్లో భాగస్వామి కావాలని అనుకోకపోవడమేనని చద్దా స్పష్టం చేశారు. నేను వారి నేరాల్లో భాగం కాలేదు కాబట్టే, వారి స్నేహానికి నేను అనర్హుడినయ్యాను అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాల నుంచి తప్పుకోవడమా లేదా సానుకూల రాజకీయాలు చేయడమా అనే రెండు ఆప్షన్లు తన ముందు ఉన్నాయని, ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. తమతో పాటు మరో ఆరుగురు ఎంపీలు (మొత్తం 7 మంది) కలిపి 2/3 వంతు మెజారిటీతో బీజేపీలో విలీనం అయ్యామని, ఇది రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం చట్టబద్ధమైనదని ఆయన పునరుద్ఘాటించారు.
ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాఘవ్ చద్దా, ఇప్పుడు అదే పార్టీపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఢిల్లీ మరియు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆప్‌లో నాయకత్వ తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!

