తూర్పు భారత్ అభివృద్ధిపై మోదీ

6
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, తూర్పు భారతదేశ అభివృద్ధిపై తన దార్శనికతను పంచుకున్నారు. దేశాభివృద్ధిలో ఈ ప్రాంతం పోషించాల్సిన కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు.

భారత భాగ్యోదయం.. పూర్వోదయ (తూర్పు భారత్ అభివృద్ధి) లేకుండా అసంపూర్ణం అని ప్రధాని పేర్కొన్నారు. తూర్పు భారతదేశం పురోగమిస్తేనే దేశం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంగ్-బంగ్-కంగ్ (Ang-Bang-Kang)…’అంగ్’ (బీహార్ ప్రాంతం), ‘బంగ్’ (బెంగాల్), ‘కంగ్’ (ఒడిశా/కళింగ) ప్రాంతాల మధ్య ఉన్న చారిత్రక మరియు భౌగోళిక అనుసంధానతను ప్రస్తావించారు. ఈ మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు.

పొరుగు రాష్ట్రాలైన ఒడిశా మరియు బీహార్‌లలో ఇప్పటికే బీజేపీ బలోపేతమైందని, ఈసారి పశ్చిమ బెంగాల్ వంతు వచ్చిందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. “ఈసారి బెంగాల్‌లో కమలం వికసించడం ఖాయం” అని ఆయన జోస్యం చెప్పారు.గత దశాబ్దాలుగా తూర్పు భారత్ ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం తొలగిస్తోందని, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఈ ప్రాంతాన్ని దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.

Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!

బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన పిలుపునిచ్చారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -