కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. కన్నూర్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ, కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ….ఒకేసారి ఎల్డీఎఫ్ మరియు (బీజేపీతో పోరాడుతోందన్నారు.ఈ ఎన్నికలను “రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం”గా అభివర్ణించిన రాహుల్ గాంధీ, కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరియు యూడీఎఫ్ మధ్య పోటీ జరుగుతోందన్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఎల్డీఎఫ్, బీజేపీ మధ్య ఒక విధమైన భాగస్వామ్యం కనిపిస్తోందని ఆరోపించారు.
ఎడమపక్ష పార్టీ, కుడిపక్ష పార్టీతో కలవడం ఎలా సాధ్యం? ఇది ఒక పెద్ద పజిల్ లాంటిదిఅని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా వేదికపై ఉన్న మాజీ సీపీఎం నాయకులు వి. కుంహికృష్ణన్, టి.కే. గోవిందన్లను ప్రస్తావిస్తూ…వారు ఇప్పుడు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఎడమ భావజాలం ఉన్నవారు ఇప్పుడు కాంగ్రెస్‌తో ఉన్నారు అన్నారు.
శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారం కోల్పోయిన అంశంపై బీజేపీ స్పందించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో మతం, ఆలయాల గురించి మాట్లాడే మోదీ…కేరళలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం అనుమానాస్పదమని అన్నారు. హిందుత్వాన్ని రక్షిస్తున్నామని చెప్పుకునే బీజేపీ, కేరళలో మాత్రం ఈ విషయంపై మౌనం పాటిస్తోంది. ఎందుకంటే ఎల్డీఎఫ్ అధికారంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు అని ఆరోపించారు.
Also Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!

