ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ పొరపాటులే అలవాటుగా మరోసారి టంగ్ స్లిప్ అయి వార్తల్లో నిలిచారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా బుధవారం లోకేశ్ నోరు జారారు. తెలుగు దేశం పార్టీ నుంచి పీవీ ప్రధానమంత్రి అయ్యారంటూ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు.దీంతో అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు.
తాను పోరపాటు చేశానని గ్రహించిన లోకేష్ అనంతరం తప్పు సవరించుకున్నారు. తెలుగు ప్రజల నుంచి పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యారంటూ కవరింగ్ ఇచ్చుకున్నారు. కాగా గతంలోనూ అనేకసార్లు నారా లోకేశ్ తన వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ అంటూ పదాలను పలకడంలో ఇబ్బంది పడ్డ లోకేష్… ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున.. వర్ధంతి అని మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఇక ఏప్రిల్ 18న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో పర్యటిస్తూ ..‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని మాట్లాడిన లోకేష్ అనంతపురం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని మాట్లాడి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
ప‌్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పప్పు అన్న నిక్‌నేమ్ పెట్టిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే రోజా పలు సందర్భాల్లో లోకేష్‌ని పప్పు అని విమర్శలు గుప్పించగా కేంద్రమంత్రి వెంకయ్య…రాహుల్‌ని పప్పు అని సంబోంధించి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలోనైతే లోకేష్ సౌత్ పప్పుగా…రాహుల్‌ని నార్త్ పప్పుగా నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేసిన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో సొంతపార్టీ నేతలే రాహుల్‌ని పప్పు అని విమర్శించారు. యూపీలోని మీరట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వివేక్ ప్రధాన్.. ఓ వాట్సాప్ గ్రూప్‌లో రాహుల్‌ను పప్పు అని పిలిచి కాంగ్రెస్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.