లోకేష్ ఇక మారడా..?

221
- Advertisement -

సోషల్ మీడియాలో ఇప్పుడు లోకేష్‌కి సంబంధించిన వార్తలే వైలర్‌ అవుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ అంటూ పదాలను పలకడంలో…  ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున.. వర్ధంతి అని.. ఏప్రిల్ 18న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో పర్యటిస్తూ ..‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని… అనంతపురం జిల్లాలో పర్యటించిన లోకేశ్ వచ్చే ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని.. ఇలా ప్రతీ మీటింగ్‌లో పొరపాటు పడ్డ ఏపీ యువ మంత్రి నారా లోకేష్ మరోసారి పప్పులో కాలేశాడు.

Lokesh agains mistakes..!
‘అమరావతిలో మండలి చైర్మన్‌ చక్రపాణి గారిని కలుసుకోవడం సంతోషంగా ఉంది..’ అంటూ గురువారం రాత్రి నారా లోకేశ్‌ తన అఫీషియల్‌ ట్విట్టర్‌ పేజీలో ఒక పోస్ట్‌ పెట్టారు. అయితే ఆ స్టేటస్‌కు జత చేసిన ఫొటోలో అసలు చక్రపాణిగారు లేకపోవడంతో ట్విట్టర్స్‌ అవాక్కయ్యారు. కాగా, కొద్దిసేపటికిగానీ సన్నిహితులు చెప్పడంతో తప్పు తెలుసుకున్న లోకేశ్‌.. పాత ట్వీట్‌ను తొలగించి సరైన ఫొటోతో మరో ట్వీట్‌ చేశారు.

Lokesh agains mistakes..!

కొసమెరుపు: మూడు రోజుల కిందట వెలగపూడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్‌.. ప్రతిపక్షాలు తనను పప్పు అని ఒకసారి, అవినీతిపరుడని మరోసారి విమర్శిస్తున్నాయని, ఆ రెండింటిలో తాను ఏదో (పప్పా?, అవినీతిపరుడా?) తేల్చి చెప్పాలని అన్నారు. ఆయన పప్పా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే.. తప్పులు మాత్రం విధిగా, విరివిగా చేస్తున్నారని చెప్పక తప్పదు.

- Advertisement -