షాకింగ్‌: టాప్‌ హీరో బెడ్‌ రూంలో కెమెరాలు..!

209
- Advertisement -

వరుస సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. హాలీవుడ్, బాలీవుడ్ లలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోకు టాలీవుడ్ లో జూనియర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఉన్నట్టుండి ఇంకా బిగ్‌బాస్‌ షో స్టార్ట్‌ అవకముందే ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.

Jr.NTR's Big Boss Promo is out. Seen Yet?

అసలు విషయమేంటంటే.. పొద్దున్నే ఆరింటికి అలారం మోగింది. దుప్పటి తీస్తూనే అలారంని ఆపాడు తారక్. కూర్చొని కాఫీ కప్పు అందుకున్నాడు. ఇంతలో షాక్.. తన బెడ్‌రూంలో వరసగా ట్రైపాడ్లపై కెమెరాలు దర్శనమిచ్చాయి.

దీంతో ఖంగుతిన్న ఎన్టీఆర్.. ‘ఓరి నాయనో.. కెమెరాలెవడ్రా ఇక్కడ పెట్టింది. నేను పెట్టమన్నది బిగ్ బాస్ హౌస్‌లో, నా హౌస్‌లో కాదు’ అంటూ కంగారు పడిపోయాడు. ఇదంతా నిజంగానే అనుకుంటున్నారా..? కాదులెండి. తెలుగులో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ షోకి సంబంధించిన ప్రోమో ఇది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్‌ చేస్తోంది.

Jr.NTR's Big Boss Promo is out. Seen Yet?
హిందీలో సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ బుల్లి తెర షో ‘బిగ్ బాస్’‌ను సౌతిండియాలో కూడా పరిచయం చేస్తున్నారు. దీనిలో భాగంగానే తమిళంలో కమల్ హాసన్‌తో, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో షోను నిర్వహిస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో తెలుగులో కూడా వచ్చేస్తుంది.

Jr.NTR's Big Boss Promo is out. Seen Yet?

వెండి తెరపై తన నట విశ్వరూపాన్ని చూపించే తారక్.. బుల్లితెరపై ఏంమాయ చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి.. ‘మీలో ఎవడు కోటీశ్వరుడు’ ద్వారా తెలుగు ప్రజలను మెప్పించారు. రీసెంట్‌గా రానా కూడా ‘నం.1 యారి’ అంటూ షోను ప్రారంభించాడు. ఇప్పుడు యంగ్ టైగర్ వంతు.. మరి ఎన్టీఆర్‌ ఏ రేంజ్‌ లో ఫ్యాన్స్‌ని అట్రాక్ట్‌ చేస్తాడో.  ఇక ఈ ప్రోమో పై   మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -