ఢిల్లీలో ఘనంగా బోనాల సంబరాలు

190
Bonala Utsavalu at New Delhi
- Advertisement -

హైదారాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా లోని చారిత్రిక సింహవాహిని శ్రీ మహంకాళీ ఆలయం కమిటీ, ఢిల్లీలోని ఆంధ్రా, తెలుగు అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నేడు ,రేపు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇండియగేట్ నుండి బోనాల ఊరేగింపును తెలంగాణ ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యం.ఎల్.సి కర్నె ప్రభాకర్ ప్రారంభించారు.మహిళలు బోనాలెత్తుకొని ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసం, శివసత్తుల పూనకాలు, ఒగ్గు డోలు దరువులతో ఉత్సాహంగా కోనసాగుతుండగా.. ఢిల్లీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Bonala Utsavalu at New Delhi

తెలంగాణ భవన్ లోని ప్రధాన హాల్ లో ఘట ప్రతి స్థాపన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి రెండు రోజుల పాటు అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు.

మంగళవారం బోనాల వేడుకలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. మహంకాళి అమ్మవారికి కేంద్రం తరపున పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. భావితరాలకు సంప్రదాయ పండుగలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, ఆలయ కమిటీ నిర్వాహకులకు వెంకయ్య అభినందనలు తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

venkaiah

- Advertisement -