బిగ్ బాస్ 7కి బాలకృష్ణ హోస్ట్

190
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఆహా వీడియో కోసం అన్ స్టాపబుల్ షో హోస్ట్ చేసినప్పటి నుండి ఓటీటీలో పాపులారిటీ బాగా పెరుగుతోంది. మొదటి సీజన్‌ సక్సెస్‌ అయిన తర్వాత ప్రస్తుతం రెండో సీజన్‌ జరుగుతోంది. ప్రస్తుతం ఓటీటీ షో చేస్తున్న బాలకృష్ణ త్వరలోనే బుల్లితెరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

స్టార్ మాలో ప్రఖ్యాతి గాంచిన బిగ్ బాస్ షో ఏడో సీజన్‌కు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణకి భారీ మొత్తంలో చెల్లించి టీవీ ఛానల్‌ ఆయన్ని ఫిక్స్ చేసుకుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ షో మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు.రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. షో యొక్క తదుపరి నాలుగు సీజన్‌లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఆరవ సీజన్ ఈ ఆదివారం ముగిసింది. బహుశా ఇది నాగార్జునకు చివరి సీజన్. మరి బాలకృష్ణ ఈ షోని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

డిసెంబర్‌24..మా బావ మనోభావాలు సాంగ్‌

పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్

బన్నీ , సుక్కు మాటిచ్చేశారు

- Advertisement -