మామిడిపండ్లు ఎక్కువగా తింటున్నారా?

275
- Advertisement -

వేసవి వస్తే చాలు మామిడి పండ్ల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తికాదు. నిజానికి సవిలో మనకు లభించే అద్భుతమైన ఫలం మామిడి. సీజనల్‌గా వచ్చే ఈ పండ్లు ప్రతి ఒక్కరి నోరు ఊరించడం ఖాయం. బంగినపల్లి, తోతపురి, కొబ్బరి మామిడి, రసాలు ఇలా అనేక రకాల మామిడి పండ్లు మన కళ్లముందు కనబడుతుంటే ఆగలేక తినేస్తాం. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు.

అయితే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. లెక్కకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే. మరి మామిడి పండ్లను అపరిమితంగా తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరుగుతారు..
మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక మోస్తరు మామిడి పండును తినడం 135 క్యాలరీలు లభిస్తాయి. అందువల్ల ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వల్ల మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. అయితే రోజూ వ్యాయామం చేసేవాళ్లకు ఇది పెద్ద ఇబ్బంది కాదు. మామిడి పండ్లు ఎక్కువగా తిన్నా.. రోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు.

సుగర్ పెరుగుతుంది..
మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమం.

కార్బైడ్ పండ్లు..
ప్రస్తుతం చాలా మంది వ్యాపారులు మామిడి పండ్లను సహజసిద్ధంగా మాగబెట్టడం లేదు. కాల్షియం కార్బైడ్ అనే కెమికల్‌ను వాడి ఆర్టిఫిషియల్‌గా ముగ్గబెడుతున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాళ్లు, చేతులు లాగడం, తిమ్మెర్లు వంటి రుగ్మతల బారిన పడతారు.

అజీర్తి సమస్య..
సరిగా మాగని మామిడి పండ్లను తినడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. పొట్టలో మంట, సరిగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. పచ్చి మామిడిని ఎంత తక్కువ తింటే అంత మంచిది.

చర్మ సంబంధిత వ్యాధులు..
మామిడి పండ్లను విపరీతంగా తినేవాళ్లలో గమనించిన మరో సమస్య.. అలర్జీ. చర్మంపై బొబ్బలు, సెగగడ్డలు, ఎర్రటి కాయలు వస్తాయి. మామిడి పండ్లు శరీరానికి వేడి చేస్తాయని పెద్దలు అంటుంటారు. అందువల్లే సెగగడ్డలు వస్తాయట.

ఇవి కూడా చదవండి..

- Advertisement -