తల్లిదండ్రులు పిల్లల్ని బెదిరిస్తున్నారా?

17
- Advertisement -

పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పిల్లలపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లకు కూడా గారాబంగా తయారవుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి పిల్లలను గారాబంగా చూసుకోని వారు కాస్త పెద్దయిన తర్వాత అల్లరి చేస్తే తల్లిదండ్రులకు చిరాకు వేస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో పిల్లలను కొట్టడం గాని లేదా బెదిరించడం గాని చేస్తుంటారు. ఇలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. పిల్లల్ని బెదిరించడం లేదా కొట్టడం చేస్తే తల్లిదండ్రులపై పిల్లలు మానసికంగా ద్వేషం పెంచుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. .

కాబట్టి తల్లిదండ్రులపై చిన్న వయసులోనే పిల్లలకు ద్వేషం ఏర్పడితే పెద్దయ్యే కొద్ది వారిలో ఆ ద్వేషం కూడా అలాగే పెరుగుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిల్లలను డీల్ చేసే విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లలు అల్లరి చేయడం, వస్తువులు పగలగొట్టడం, కోపం తెప్పించేలా వ్యవహరించడం మామూలే. కాబట్టి అలాంటి సమయాల్లో వారిని బెదిరించకుండా సున్నితంగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి.

అప్పటికి వినకపోతే వారి దృష్టి మళ్లించేలా తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఆడుకోవాలి. అప్పుడు పిల్లలు మరింత ఉత్సాహంగా మారి వస్తువులను పగలగొట్టడం, అల్లరి చేయడం మాని అమ్మ నాన్నలతో ఆడుకునేందుకు ఇష్టపడతారు. ఇంకా పిల్లల అల్లరి విషయంలో చిన్న చిన్న విషయాలను చూసి చూడనట్లుగా వ్యవహరించాలి. చాలామంది పిల్లలను బూతులు తిడుతూ ఉంటారు. అలా తిట్టడం వల్ల చిన్న వయసులోనే బూతు పదాలు పిల్లల మదిలో స్థిరపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలను ఎట్టి పరిస్థితిలో బూతులు తిట్టకూడదు. సాధ్యమైనంత వరకు వారిని బుజ్జగిస్తూ వారి పట్ల వ్యవహరించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మద్య బంధం మరింత బలపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

Also Read:లోకేష్ పై హేళన, జూ.ఎన్టీఆర్ పై గౌరవం

- Advertisement -