కరోనా థర్డ్ వేవ్..పిల్లలపైనే ప్రభావం

195
third wave
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో రికార్డు స్ధాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా మరణాలు సైతం వేలల్లో సంభవించాయి. దీంతో దేశంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ బాటపట్టాయి.

ఇక సెకండ్‌ వేవ్‌ షాక్ నుండి ఇంకా కోలుకోక ముందే థర్డ్ వేవ్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండ‌గా.. దాని ప్ర‌భావం చిన్నారుల‌పైనే ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క‌రోనా వైర‌స్ త‌న స్వ‌భావాన్ని మార్చుకుంటే పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం చూప‌వ‌చ్చు అన్నారు నీతిఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్. ఆ ప‌రిస్థితి వ‌స్తే..రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందాల్సిన ప‌రిస్థితి రావొచ్చు అని అంచనా వేశామన్నారు. థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని.. దీనిపై త్వ‌ర‌లో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేస్తామ‌న్నారు.

- Advertisement -