త్రివిక్రమ్ దెబ్బకు ఆమె రేంజే మారింది

36
- Advertisement -

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పైన అయినా సరే, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ హ్యాండ్ పడితే.. ఇక ఆ హీరోయిన్ రేంజ్ మారిపోతుందని బలంగా టాక్ ఉంది. అప్పట్లో సమంతకి అలాగే త్రివిక్రమ్ వరుసగా అవకాశాలు ఇచ్చాడు. ఆ తర్వాత పూజా హెగ్డేకి వరుస ఛాన్స్ లు ఇచ్చాడు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి వంతు వచ్చింది. ఆమెకు ఆల్ రెడీ మహేష్ గంటూరు కారం సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం పుష్ప‌2తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న త‌ర్వాతి సినిమాను త్రివిక్ర‌మ్‌తో ఇప్పటికే అనౌన్స్ చేశాడు.

2024 ఏప్రిల్ నుంచి మొద‌లు కానున్న ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట వినిపిస్తోంది. ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ని స‌మాచారం. ఇది నిజం అని తెలిసి మిగిలిన దర్శకులు కూడా ఇప్పుడు మీనాక్షి చౌదరి వెంట పడుతున్నారు. డాన్ శ్రీను, బ‌లుపు, క్రాక్ సినిమాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ సినిమా రీసెంట్‌గానే అనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి న‌టించ‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

అంతేనా ?, మీనాక్షి చౌదరికి మరో భారీ సినిమా కూడా వచ్చింది. మారుతి డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంద‌ని, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ప్ర‌భాస్ ర‌ఫ్ అండ్ ర‌గ్గుడ్ లుక్‌లో క‌నిపిస్తాడ‌ని, యాక్ష‌న్ అండ్ హర్ర‌ర్ నేపథ్యంలో వ‌చ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ సరసన మీనాక్షి చౌదరి నటించబోతుందని.. ఇప్పటికే ఆమెకు ఈ సినిమా మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. మొత్తానికి ఒక్క త్రివిక్రమ్ హ్యాండ్ తో మీనాక్షి చౌదరి రేంజే మారిపోయింది.

Also Read:ప్చ్.. ‘విజ‌య్ దేవ‌ర‌కొండ‌’లో మార్పు

- Advertisement -