ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం..సమగ్ర దర్యాప్తు

43
- Advertisement -

ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం అన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయం అని…. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించాం అని… ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతో కడుపులో గాయాలయ్యాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దు. అధైర్య పడవద్దని… ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు.

Also Read:ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

- Advertisement -