ఫుట్‌బాల్ ఐ-లీగ్‌లో భాగంగా శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మ్యాచ్‌కు హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని డెక్కన్ ఏరీనాలో నెరోకా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ 4-0తో ఘన విజయం సాధించింది.
తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ఆహ్వానం మేరకు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లిన జగన్‌మోహన్‌రావును హెచ్‌సీఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించినందుకు భారత ఒలింపిక్ సంఘం సీఈఓ కల్యాణ్ చౌబే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీరి మధ్య జరిగిన భేటీలో నేషనల్ గేమ్స్ చర్చకు వచ్చింది. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు తమకు అవకాశమివ్వాలని కల్యాణ్‌ను జగన్‌మోహన్‌రావు కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కల్యాణ్ త్వరలో శుభవార్త చెబుతామని జగన్‌మోహన్‌రావుకు హామీ ఇచ్చారు. దీంతో పాటు 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంపైన, ఇటీవల ముంబైలో జరిగిన ఐఓసీ సమావేశాల గురించి ఇరువురి భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి ఫల్గుణ పాల్గొన్నారు.
Also Read:ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శన..ఆగని భారత్ జైత్రయాత్ర