రిలయన్స్ జియో ప్రవేశంతో భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దానికి కారణం రిలయన్స్ జియోనే… ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది. జియో దెబ్బకి ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫొన్,లాంటి బడా కంపెనీలు సైతం లబోదిబోమన్నాయి. అయితే ఇప్పుడు టెలికాం రంగంలో ప్రత్యర్థి కంపెనీలు టచ్ చేయలేనంత ఎత్తుకు ఎదిగిన రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా దూసుకుపోవాలని చూస్తోంది.
ఇందులో భాగంగానే జియో ఫైబర్ సర్వీస్ పేరుతో ఓ సరికొత్త ఆవిష్కరణకు జియో వ్యూహ రచన చేస్తోంది. వైఫై సర్వీసులకు సంబంధించి జియో మరో తీపి కబురు కూడా అందించింది. జియో రూటర్‌ను క్యాష్ బ్యాక్‌తో అందించనున్నట్లు జియో అధికారికంగా ప్రకటించింది. ఎక్స్‌ఛేంజ్‌తో అయితే 100 శాతం క్యాష్ బ్యాక్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కొత్తగా జియో రూటర్ కొన్న వారికి కూడా 50శాతం క్యాష్ బ్యాక్‌తో విక్రయించనున్నట్లు జియో తెలిపింది. జియోఫై డోంగిల్స్ కూడా 1999 రూపాయలకే అందుబాటులోకి రానున్నాయి. కానీ 1999 రూపాయలతో కొంటే, 2010 రూపాయల లాభాలు పొందొచ్చని జియో ప్రకటించింది.
ఒక్కో టాప్ అప్ ఓచర్ ఖరీదు 201 రూపాయలని, డోంగిల్‌ను 1999 రూపాయలతో కొంటే 10 సార్లు రీచార్జ్ చేయించుకున్నట్టేనని జియో తెలిపింది. అయితే ఎక్స్‌ఛేంజ్‌లో డోంగిల్‌ను కొంటేనే ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుందని తెలిసింది.