భారతదేశంలో సైన్స్ & టెక్నాలజీ…విజయాలు

59
- Advertisement -

ప్రపంచమంతా టెక్నాలజీ జపం చేస్తోంది. అన్ని దేశాలు వివిధ రంగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతుండటంతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 వసంతాలు పూర్తవుతోంది. ఈ 76 ఏళ్లలో శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచంలో మొదటి మూడు ర్యాంకుల్లో స్థానం సంపాదించింది.
ఇందుకు శాస్త్రవేత్తలు ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన సైన్స్‌ పునాదిరాళ్లే కారణం.

హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం తదితర స్వయం సాధికారత ఆహార పథకాల్లో ముందడుగు పడింది. ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగంలో అనేక ఫ్యాక్టరీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు, భారత శాస్త్ర, సాంకేతిక రంగానికి గట్టి పునాది పడింది.దీంతో సైన్స్‌ సౌధ నిర్మాణానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేశాయి. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానంలో భారత్ దూసుకుపోతోంది. ఈ 76 ఏళ్లలో భారత్ ఎన్నో విజయాలను రికార్డ్ చేసింది.

కరోనా వేవ్, మాంద్యం భయం, అన్ని సవాళ్లను అధిగమిస్తూ చైనా కంటే భారత్ ముందు బాగంలో నిలిచింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తన పొరుగు దేశాలను పక్కకు నెట్టిన భారత్.. తన అత్యంత ప్రమాదకరమైన క్షిపణి అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-5 అణు సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇక భారత పరిశోధన సంస్థ ఇస్రో ఎన్నో మైలురాళ్లను చేధించింది.ఇప్పటికే దేశంలోని ప్రధాన పట్టణాల్లో 5G సేవలు అందుబాటులో ఉండగా దానికంటే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అయిన 6G కూడా అందుబాటులోకి రానుంది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, ఇతర విభాగాలు కలిసి పని చేయనున్నాయి.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న అద్భుత ప్రగతికి ప్రధాన కారణం మన పరిశోధన సంస్థలు. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తుండటంతో దేశం అభివృద్ధిపథాన ముందుకెళుతోంది. గత 50 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వెనుక ఈ విజ్ఞాన సంస్థల కృషి ఎంతో ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలన్నీ భారత టెక్నాలజీ రంగంలో విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించాయి.

Also Read:మోకాళ్ళ నొప్పులుంటే.. నడవకూడదా?

- Advertisement -