నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. నాగాలాండ్‌లో మహిళా రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం…బీజేపీ తీరును తప్పుబట్టింది.మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలాగా.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఇంకోలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించింది.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపైనే కేంద్రం తీవ్ర చర్యలకు పాల్పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిబంధనను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాగాలాండ్‌లో మహిళల కోటా విషయంలో మీరు చేస్తున్నది ఏంటి? అని ప్రశ్నించింది.
Also Read:కోలీవుడ్ టార్గెట్‌గా పవన్ వ్యాఖ్యలు!
కేంద్రం ఈ విషయంలో చేతులు ముడుచుకుంటే కుదరదు.. ఆ రాష్ట్రంలోని పాలక కూటమి కేంద్రానికి అనుకూలంగా ఉండటం వల్ల మీ పని మరింత సులభతరం అవుతుంది. మీకు చివరి అవకాశం ఇస్తున్నాం అని వెల్లడించింది. మహిళల విద్యా స్థాయి, వారి స్థితి, భాగస్వామ్యం దేశంలోనే అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్ అని, వారికి మున్సిపల్ పాలనలో రిజర్వేషన్లను తిరస్కరించడం సబబు కాదని కోర్టు పేర్కొంది.
Also Read:Nara Rohit:ప్రతినిధి 2 కాన్సెప్ వీడియో