అదే జరిగితే..మోడీ ఇరుకున పడినట్లే!

47
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విపక్షాలు.. ఏ చిన్న అవకాశం దొరికిన మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల దేశంలో సంచలనం సృష్టిస్తున్న మణిపుర్ అల్లర్ల విషయంలో మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు.. ఈ అంశాన్ని అంతా తేలికగా వదిలెందుకు ఏ మాత్రం సిద్దంగా లేనట్లే తెలుస్తోంది. ఎందుకంటే మణిపూర్ అల్లర్ల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అలాగే కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. కులాల మద్య ఘర్షణలు చోటు చేసుకోవడం, ఆడవారిని నగ్నంగా రోడ్లపై తిప్పడం వంటి దారుణమైన చర్యలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి..

ఇదే సరైన సమయం అని భావించిన విపక్షాలు మణిపూర్ విషయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్దమయ్యాయి. అందుకోసం పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. నిన్ననే ఈ అంశంపై అవిశ్వాస తీర్మానానికి సిద్దమైన విపక్షాలు.. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ వాయిదా పడింది. ఇక నేడు ఎలాగైనా పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు విపక్షాలు సర్వం సిద్దం చేసుకున్నాయి.

Also Read:డ్రైవింగ్ చేస్తూ హెడ్సెట్..20 వేలు ఫైన్!

ఒకవేళ విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన అది వీగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్ సభ సభ్యుల సంఖ్య 543 కాగా.. అవిశ్వాస తీర్మాన మద్దతుకు 272 సభ్యుల మద్దతు అవసరం. అయితే విపక్షాల కూటమికి 130 మంది సభ్యులే ఉండగా.. ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యులున్నారు. కాబట్టి విపక్షాలు ప్రవేశ పెట్టె అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువ. అయితే ఏ మాత్రం చర్చకు అవకాశం దక్కిన మణిపూర్ అల్లర్లపై విపక్షాలు మోడి సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. దీంతో మణిపూర్ విషయంలో మోడి సర్కార్ ఇరుకున పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:కోలీవుడ్ టార్గెట్‌గా పవన్‌ వ్యాఖ్యలు!

- Advertisement -