ఏపీ మంత్రి బొత్సపై గంగుల ఫైర్

50
- Advertisement -

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోకుండా బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇష్టానుసారం మాట్లాడ‌టం సబబు కాదన్నారు. వినోద్ కుమార్,రసమయి బాలకిషన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు గంగుల.

ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ‌పై ఇంకా విషం చిమ్మ‌డం స‌రికాద‌ని దుయ్యబట్టారు. నాడు ఉమ్మ‌డి ఏపీలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్య‌తిరేకంగా బొత్స మాట్లాడార‌ని…ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత విద్యా వ్య‌వ‌స్థ మెరుగుప‌డింద‌ని..ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ‌లో కేవ‌లంలో 297 గురుకులాలు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు గురుకులాల సంఖ్య 1009కి చేరింద‌న్నారు. రాష్ట్ర గురుకులాల్లో ఇప్పుడు ప‌ది ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నార‌ని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే అని …తప్పు చేసినవారిని శిక్షిస్తున్నాం. కానీ ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Also Read:పిక్ టాక్ : క్లీవేజ్‌ షోతో మెస్మరైజింగ్‌ పోజులు

- Advertisement -