అధికారుల బదిలితోనే హింస!

6
- Advertisement -

అధికారుల బదిలీతోనే ఏపీలో హింస చోటు చేసుకుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పిన్నెల్లి వీడియోను ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు రిలీజ్ చేయలేదు? అనే విషయాన్ని పక్కన పెడితే.. అసలేం జరిగింది? అనేది ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు బొత్స.

మా నాయకుడు జగన్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్లారు. చంద్రబాబు మాత్ర ఎక్కడికి వెళ్లారో చెప్పకుండా వెళ్లారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారులను మార్చేలా చేశారని, అందువల్లే అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే పోలీసు అధికారులను ఎస్పీ స్థాయి అధికారులను బదిలీలు చేశారో అక్కడే అల్లర్లు జరిగాయన్నారు. అన్ని పార్టీల అగ్రనాయకులు రిలాక్స్ మూడ్‌లో ఉంటే మిగితా వారు ఎందుకు కొట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

Also Read:27 ఏళ్ల తర్వాత కాజల్‌తో ప్రభుదేవ

- Advertisement -