అధ్యక్ష పదవికి నేను అర్హుడినే:రఘునందన్‌

37
- Advertisement -

బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘునందన్…పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని అన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని, రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.పార్టీ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు నిజాలేనన్నారు.

మునుగొడులో రూ. 100 కోట్లు పెట్టిన బీజేపీ గెలవలేదని… సొంతంగానే తాను దుబ్బాక ఎన్నికల్లో గెలిచానని రఘునందన్ రావు అన్నారు. అదే రూ. 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో బీజేపీని చూసి ప్రజలు ఓట్లేయలేదని…తనను చూసే ఓట్లు వేశారన్నారు. పేపర్ ప్రకటనలలో తరుణ్ చూగ్ , సునీల్ బాన్సల్‌ బొమ్మలు కాదు.. రఘునందన్ , ఈటెల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని బండిపై విమర్శలు గుప్పించారు.

Also Read:నేను డౌటే.. బండి హింట్ ఇచ్చాడా?

బండి సంజయ్‌ ది స్వయం కృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్‌కు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకూ వాటా ఉందని…ఇప్పటివరకు పార్టీకి శాసనసభపక్షా నేత లేరన్నారు. తాను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారన్నారు.నడ్డాపై బీజేపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Also Read:బీజేపీని గద్దె దించడమే లక్ష్యం:అఖిలేష్

- Advertisement -