నేను డౌటే.. బండి హింట్ ఇచ్చాడా?

44
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని అధిష్టానం తొలగించబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ అటు బండి సంజయ్ గాని తెలంగాణ బీజేపీ నేతలు గాని ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఈ మద్య ఈ వార్తల తీవ్రగా మరింత ఎక్కువైంది. దానికి కారణం రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం సంస్థాగత మార్పులపై కసరత్తులు చేస్తుండదడమే. ఈ ఏడాది చివర్లో రాజస్తాన్, మద్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలలో బీజేపీ సత్తా చాటలంటే పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరత ఉంది..

పార్టీ అధ్యక్ష పదవి నుంచి జిల్లా ఇంచార్జ్ పదవుల వరకు అన్నిట్లోను పూర్తి మార్పులు చేసేందుకు బీజేపీ పెద్దలు సిద్దమౌతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధ్యక్ష పదవి మార్పు కూడా తప్పెలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని బీజేపీ నుంచి వినిపించిన మాట. అయితే ప్రస్తుతం బండి సంజయ్ నాయకత్వంపై బీజేపీ కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికి ఇతరత్రా విషయాల పరంగా ఆయన నాయకత్వంపై సొంత పార్టీ నేతలే లొసుగులు బయట పెడుతున్నారు.

Also Read:ఆగస్టు 18న ‘పెద్ద కాపు-1’

దీంతో అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని దించి ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేసేందుకు అధిస్థానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానుండడంతో.. ప్రధాని మోడీ సభకు తాను అధ్యక్షుడి హోదాలో వస్తానో లేదో అంటూ బండి సంజయ్ అనుమానంగా చేసిన వ్యాఖ్యలు..అధ్యక్ష పదవి మార్పుకు బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పిస్తే.. సి‌ఎం అభ్యర్థిగా ఆయననే ప్రకటించేందుకు అధిస్థానం సిద్దమౌతోందా అనే డౌట్ కూడా ఉంది. మొత్తానికి అధ్యక్ష పదవి మార్పు తప్పదనేలా బండి సంజయ్ హింట్ ఇవ్వడం చర్చనీయాంశం.

Also Read:సినీ లోకంలో రెండు విషాదాలు

- Advertisement -