ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా,సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా రామాయణం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కింది ఈ చిత్రం. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చినజీయర్ స్వామి..సాధారణంగా మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్ కి రారు. కానీ ఇక్కడ అందరిలో రాముడు ఉన్నారు. శ్రీమాన్ ప్రభాస్ రాముడిని అందరికి చూపిస్తున్నారు. నిజమైన బాహుబలి రాముడు. రాముడు గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన ఈ నేలపై నడిచి పావనం చేసిన మనిషి అన్నారు.
Also Read:Prabhas:చిరు మాటలు మర్చిపోలేను
రామాయణంలో దేవతలంతా వచ్చి రాముడికి నువ్వు సాక్షాత్తు శ్రీనారాయణుడు, సీతా శ్రీ లక్ష్మి దేవి అని చెప్తే నేను మానవ మాత్రుడ్ని మాత్రమే అని అన్నారు. ఒక మనిషి సన్మార్గంలో నడిచి చూపించడానికి రాముడు మనిషి అయ్యాడని చెప్పుకొచ్చారు. ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. రాముడ్ని మనుషులంతా ప్రేమించారన్నారు.
ప్రభాస్ కూడా తనలో ఉన్న రాముడ్ని బయటకు తీసుకొస్తున్నారు అని అన్నారు. రామాయణంలో అరణ్యకాండ, యుద్ధకాండలో ఉన్న కథని చరిత్రకు అందించాలని ఆశతో సినిమా చేస్తున్నాము అని చెప్పారు. ఇంతకంటే లోకానికి మరో ఉపకారం ఉండదు. ఇలాంటి మంచి పనులు చేసే వీరికి ఇక్కడ ఏడుకొండలపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకున్నారు జీయర్ స్వామి.
Also Read:గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే!