గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు ఇవే!

38
- Advertisement -

నేటి రోజుల్లో గుండెపోటు మరణాలు అధికంగా పెరుగుతున్నాయి. గుండెపోటు కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా మృత్యువు ఒడిలోకి చేరుకుంటున్నారు. గతంలో వయసు పైబడిన వారిలోనే కనిపించే గుండె పోటు సమస్య నేటిరోజుల్లో చిన్న పిల్లల నుంచి యుక్త వయసు వారిలో కూడా కనిపిస్తోంది. హటాత్తుగా సంభవించే ఈ గుండెపోటు కు సరైన టైమ్ మెరుగైన చికిత్స అందిస్తే తప్పా ప్రాణాల నుంచి బయట పడడం కష్టం. అందువల్ల గుండెపోటు అనేది నేటి రోజుల్లో పెను విపత్తుగా మారింది. కాగా గుండెపోటు సంభవించే సమయంలో కొన్ని సంకేతాలు మన శరీరంలో కనిపిస్తాయి. వాటిని గ్రహించి వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల కొంతలో కొంతైనా మరణం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండెపోటుకు ముందు కనిపించే సూచనలు ఏవో తెలుసుకుందాం.

గుండెపోటు ముందు ఒళ్ళంతా చెమటలు పట్టడం, హైపర్ టెన్షన్ కు లోనవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఊపిరితిత్తులలో మంట నొప్పి వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సూచికగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. గుండె భారంగా అనిపించిన లేదా గుండెల్లో మంట, ఒళ్ళు నొప్పులు, చిన్న పనులకే అలసట ఏర్పడడం వంటివి. ఇంకా ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, గ్యాస్ అసిడిటీ, వంటి సమస్యలు కూడా కొన్నిసందర్భాల్లో గుండెపోటును సూచిస్తాయి. మైకం, శరీరం పై సూదులతో గుచ్చుతున్న ఫీలింగ్ రావడం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సూచనలే.

Also Read: చేతివృత్తులకు భరోసా..లక్ష ఆర్థిక సాయం

కొందరిలో దవడనొప్పి, గొంతు నొప్పి, శరీర పైభాగం నుంచి ఎడమ చేతి వరకు నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు కూడా గుండెపోటును సూచిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి లక్షణాలు గుండె సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఏమైనా గుండె సమస్యలు ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా హార్ట్ బీట్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. గుండె కొట్టుకోవడంలో ఏమైన అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కాగా కేవలం గుండె సమస్యలు ఉన్నవారిలో మాత్రమే కాకుండా పై లక్షణాలలో ఏ మూడు లక్షణాలు కనిపించిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read: చికెన్‌ తింటున్నారా.. జాగ్రత్త !

- Advertisement -