మధ్యప్రదేశ్‌లో ది కేరళ స్టోరీకి పన్ను మినహాయింపు..!

69
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. ఈ విషయాన్ని శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. పిల్లలూ పెద్దలూ అందరూ తప్పకుండా ఈ సినిమాన్ని చూడాలని కోరారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మతమార్పిడికి సంబంధించిన చట్టంను తీసుకువచ్చింది. ఈ సినిమా కూడా మతమార్పిడులపై అవగాహన తీసుకొస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు చిన్నారులు ఆడపిల్లలు అందరూ చూడతగ్గ  సినిమా అని అన్నారు. అందుకే ఈ సినిమాపై పన్ను మినహాయింపులు కల్పిస్తున్నట్టు తెలిపారు.

Also Read: మే 6..మోతీలాల్‌ నెహ్రూ జయంతి

అదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమాను విపుల్‌ షా నిర్మించగా సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. తమిళనాడు కేరళ లోని కొన్ని థియేటర్లో సినిమాలను ప్రదర్శించలేదు. ఈ సినిమా వివాదంపై కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది కర్నాటక ఎన్నికల దృష్ట్యా విడుదల చేస్తున్నారని అన్నారు.

Also Read : మే 6..నారద జయంతి

అయితే ఇదే ఆంశంపై మోదీ స్పందిస్తూ ప్రకృతి అందాలకు నెలవైన రాష్ట్రంలో ఉగ్ర కుట్రలను కేరళ స్టోరీ బయటపెట్టిందని మోదీ అన్నారు.  కాగా నేడు మధ్యప్రదేశ్ సీఎం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -