కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

33
- Advertisement -

కర్నాటక ఎన్నికలు దగ్గర పడుతునన్న వేళ ఫ్యామిలీ పాలిటిక్స్ తెరపైకి వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు వారి వారి వారసులను బరి దించుతుడడంతో ఎవరికి కన్నడ ప్రజలు జై కొడతారు ? ఎవరిని పక్కన పెడతారు ? అనే చర్చ కన్నడనాట జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపుర్ నియోజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఈసారి కూడా ప్రియాంక్ ఖర్గే కచ్చితంగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తండ్రి మల్లికార్జున్ ఖర్గే అధ్యక్ష చేపట్టిన తరువాత ప్రియాంక్ ఖర్గే గెలుపోటములు మల్లికార్జున్ ఖర్గే పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో ప్రియాంక్ గెలుపుకోసం మల్లికార్జున్ ఖర్గే శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక కుటుంబ రాజకీయాలకు పెద్ద పీట వేసే జెడిఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..

ఈ పార్టీలో దాదాపులో ఏడు నుంచి ఎనిమిది మంది సభ్యులు దేవగౌడ కుటుంబానికి చెందిన వారే ఉన్నారు. దేవగౌడ మనవడు నిఖిల్ గౌడ ఈ ఎన్నికల్లో బెంగళూరు సమీపంలోని రామనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎంపీ గా పోటీ చేసిన నిఖిల్ అప్పుడు ఓటమిపాలు అయ్యారు. దాంతో ఈసారి నిఖిల్ ను కచ్చితంగా గెలిపించుకోవాలని దేవగౌడ ఫ్యామిలీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఫ్యామిలీ పాలిటిక్స్ కు తామేప్పుడు దూరం అని చెప్పుకొచ్చే బీజేపీలో కూడా ప్రస్తుతం కుటుంబ రాజకీయాలే నడుస్తున్నాయి. మాజీ సి‌ఎం యడ్యూరప్ప తాను గతంలో పోటీ చేసిన నియోజిక వర్గం నుంచి తన తనయుడిని బరిలోకి దించుతున్నట్లు ఇటీవల ప్రకరించారు. దాంతో మొత్తం మీద ప్రధాన పార్టీలలో కీలక నేతల వారసులు ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఎవరు విజయం సాధిస్తారు ? ఎవరు అపజయాన్ని మూటగట్టుకుంటారు ? అనేది చూడాలి.

Also read: బీజేపీ వైసీపీ దోస్తీ.. నో నో !

- Advertisement -