Janga Raghavareddy:జంగాపై సస్పెన్షన్ వేటు

53
- Advertisement -

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు తారాస్ధాయికి చేరాయి. కొంతకాలంగా జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇద్దరు వరంగల్ పశ్చిమ సీటుపై కన్నేయడటమే దీనికి కారణం. ఇద్దరు పోటాపోటీ యాత్రలు చేస్తుండగా జంగా ఒక అడుగు ముందుకేసి తానే వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ అభ్యర్థిని అని ప్రకటించుకున్నారు.

దీంతో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు నాయిని. అధిష్టానం ఆదేశాలతో జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దుతో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు నాయిని.

జనగామ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడిగా ఉండి హనుమకొండలో పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలు చేయడంపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై జంగా ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -