” సింహగర్జనసనం” వేస్తే ఎన్ని ఉపయోగాలో..!

46
- Advertisement -

మన రోజువారి జీవనంలో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని నిపుణులు చెబుతూ ఉంటారు. కొందరు వ్యయమాన్ని అలవాటు చేసుకుంటారు. మరికొందరు పట్టించుకోరు. అయితే వ్యాయామం గాని లేదా యోగా గాని ప్రతిరోజూ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. మన శరీరంలో తరచూ వేధించే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నడుమునొప్పి, మెడనొప్పి, మలబద్దకం, గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు.. ఇలా ఎన్నో రకాల సాధారణ సమస్యలకు యోగా ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ యోగా చేయాలని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ రోజు యోగలోని ” సింహగర్జనసనం ” గురించి తెలుసుకుందాం !

సింహగర్జనసనం అనగా సింహంలా గర్జించే విధంగా ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి సింహగర్జనసనం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం ఎలా వేయలో చూద్దాం. ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై వజ్రాసనం వేయాలి. ఆ తరువాత రెండు మోకాళ్ళను ఒక అడుగున్నర ఎడంలో చాపి.. రెండు అరచేతి వేళ్ళు మనశరీరం పై వుండేలా అరచేతులను మోకళ్ల మద్యన నేలకు ఆనించి పెట్టాలి. చేతులను నిటారుగా పెట్టి వాటి ఆధారంతో శరీరాన్ని ముందుకు వంచాలి. విల్లు వలె వెనుక భాగాన్ని ఉంచి సాధ్యమైనంత వరకు తలను వెనుకవైపుకు వంచి మెడ భాగంలో చలనం గమనింపవలెను. ఆ తరువాత కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ కనుబొమ్మల మద్య దృష్టి పెడుతూ శరీరాన్ని మొత్తం రిలాక్స్ గా ఉంచాలి. ముక్కు ద్వారా మాత్రమే గాలిని నెమ్మదిగా పిల్చుతూ శ్వాస వదిలేటప్పుడు నోటిని తెరిచి నాలుకను ఎంత వీలైతే అంత బయటపెట్టి సౌండ్ చేస్తూ శ్వాస వదలాలి.

ఈ సింహగర్జనసనం వేయడం వల్ల అన్నీ రకాల గొంతు సమస్యలు దూరం అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. అంతే కాకుండా ఊపిరితిత్తులకు, మూత్రపిండాలు, కాలేయం వంటి వాటికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి…

మగవారికి వరం లాంటి ‘మయురాసనం’!

గ్యాస్ సమస్యలను దూరం చేసే ‘యోగముద్రాసనం’!

కంటి చూపును పెంచే మత్స్యాసనం!

- Advertisement -