మమ్మల్ని ఎదుర్కొవడం చాలా కష్టం…

49
- Advertisement -

రణరంగంలో తమను ఎదురించే నిలిచే దేశం ఇప్పటివరకు రాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. స్టాలిన్ గ్రాడ్ యుద్దం జరిగి 80యేళ్లు పూర్తి సందర్భంగా నాటి యుద్ద వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ…రెండో ప్రపంచ యుద్దంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద జర్మనీ సైనిక బలగాలను దాదాపుగా 91వేల మందిని బంధించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో రెండో ప్రపంచయుద్ద గతిని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు స్టాలిన్ గ్రాడ్‌ను వొల్గొగ్రాడ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఉక్రెయిన్ జర్మనీ నుంచి యుద్ద ట్యాంకులను కొనుగోలు చేయాలని భావిస్తున్న వేళ పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపింది. ముఖ్యంగా జర్మనీ యుద్ద ట్యాంకులను ఉద్దేశించి మాట్లాడినా పుతిన్…మేం మా యుద్ద ట్యాంకులను వారి సరిహద్దులోకి పంపడంలేదు. కానీ వారిని ఎదుర్కొనే మార్గాలు పుష్కలంగా మా దగ్గర ఉన్నాయన్నారు. యుద్దం అంటే ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

ప్రస్తుత అధునిక నాజి భావజాలాన్ని మనం చూస్తున్నామని…అందుకుతగ్గట్టుగానే రష్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదిరించాలని అన్నారు. అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెల్‌న్‌స్కీ ఈయూ నేతలతో భేటీ అయ్యారు. రష్యా యుద్దం చేస్తున్న సందర్భంగా ఈయూ నేతలతో భేటీ కావడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈయూలో చేరికపై వేగంగా పావులు కదుపుతున్నట్టుగా పలువురు అంతర్జాతీయ రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

మోదీ…గ్లోబల్ లీడర్ అప్రూవల్‌

సీఎం కేసీఆర్‌పై తమిళి సై ప్రశంసలు..

5న కేబినెట్ భేటీ..

- Advertisement -