సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో ఖుషి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అయ్యింది. ఐతే, తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి దర్శకుడు శివ నిర్వాణ ఒక గుడ్ న్యూస్ షేర్ చేశారు. శివ నిర్వాణ ట్వీట్ చేస్తూ ‘ఖుషి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని పోస్ట్ చేశారు.
అలాగే శివ నిర్వాణ తన పోస్ట్ లో ఖుషి సినిమా షూటింగ్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా సాగుతుందని పోస్ట్ చేశాడు. మొత్తానికి ఈ మూవీ గురించి నెట్టింట వచ్చిన అనేక రూమర్స్ కు శివ నిర్వాణ ట్వీట్ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఇక ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ దేవరకొండ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.
ఇవి కూడా చదవండి…