తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే నేడు గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. సీనియర్ నాయకులంతా హాజరయిన సమావేశంలో కీలకమైన సూచనలు జారీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…నేను ఎవరికీ అనుకూలమైన వ్యక్తిని కాదు. అలాంటి ఆలోచన పక్కన పెట్టండని సూచించారు. నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటా…సమస్యలు ఉంటే నాతో చెప్పండి…నాకు ఫోన్ చేయండి. అధిష్టానం చెప్పింది చేయడమే నావిధి అని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మన ప్రభుత్వం వస్తుందన్నారు. దీనికి తగ్గట్టుగానే సీనియర్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించాలి అని సూచించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎముకలు కోరికే చలిలో భారత్‌జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాథ్ సే హాథ్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తిచేయాలని సూచించారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర ద్వారా రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకువెళ్ళాలని అన్నారు. నేతలంతా ఐక్యంగా ఉండి పనిచేయాలని సూచించారు.
పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి 50నియోజకవర్గాలకు తగ్గకుండా ఈ యాత్ర చేయాలని ఆదేశించారు. అదే సమయంలో మిగిలిన సినీయర్ నాయకులు కూడా కనీసం 20 నుంచి 30నియోజకవర్గాల్లో పర్యటించాలని అదేశించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయం సమస్యలు ఉంటే నాతో చెప్పండి. అంతే తప్ప పార్టీకి నష్టం వచ్చే విధంగా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి…