బిజేపీకి ప్రజలే చెక్ పెట్టేశారుగా!

19
- Advertisement -

ఇటీవల జరిగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ( CESS ) ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ చిరస్మరణీయ విజయం సాధిచింది. మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. అన్నీ స్థానాల్లోనూ బి‌ఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. టి‌ఆర్‌ఎస్ నుంచి బి‌ఆర్‌ఎస్ గా మారిన తరువాత.. పార్టీకి ఇవే మొదటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. మొదటి ఎన్నికల్లోనే బి‌ఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ విజయాన్ని నమోదు చేయడంతో బి‌ఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పట్టు కోసం బి‌ఆర్‌ఎస్ తో పాటు బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా గట్టిగానే ఫోకస్ చేశాయి. ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతమే అయినప్పటికి పట్టు కోసం గట్టిగానే ప్రయత్నించాయి.

సిరిసిల్ల సెస్ పరిధిలో 15 డైరెక్టర్ స్థానాలు ఉండగా 75 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక మొత్తం 87,130 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్ లో 73,189 మంది పాల్గొన్నారు. ఈ నెల 24 న ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడగా ఓటర్లు స్పష్టమైన తీర్పుతో బి‌ఆర్‌ఎస్ పక్షాననే నిలిచారు. ఈ ఫలితాలు బి‌ఆర్‌ఎస్ కు దిమ్మతిరిగే షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం మాదే.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని తరచూ చెప్పుకునే బిజేపీకి.. సిరిసిల్ల సెస్ పరిధిలో ఒక్క స్థానం కూడా దక్కకపోవడం చూస్తే ప్రజా మద్దతు బి‌ఆర్‌ఎస్ కే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక సెస్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేయడంపై ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ హర్షం వ్యక్తం చేశారు. సెస్ ఎన్నికల ఫలితాలతో బిజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించరాని, గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతూ బిజేపీ చేసిన కుటిల ప్రయత్నాలను ప్రజలు ఒమ్ము చేశారని, బిజేపీ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే దానికి ఈ ఎన్నికలే నిదర్శనం అంటూ కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా సెస్ ఎన్నికల ఫలితలే పునరావృత్తం కానున్నాయని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి గెలుపు కోసం కమలనాథులు చేసిన ప్రయత్నాలకు ప్రజలే చెక్ పెట్టారని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి…

- Advertisement -