దేశంలో గులాబీ పార్టీ వికసిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండల క్రేంద్రంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే మనరికార్డులు మనమే తిరగరాసుకునేవాళ్లమని ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మనం వేరే వాళ్ల రికార్డులు బద్దలు కొట్టడం కాదని అన్నారు.
గులాబీ కండువా అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు. గులాబీ జెండా ఎగిరే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం 24 గంటలు కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఒకప్పుడు రాయికల్ వలసల మండలంగా ఉండే. ఇప్పుడు పంటల మండలంగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 20 వేల ఎకరాల్లో వరి సాగు జరిగేది. కేసీఆర్ సీఎం అయ్యాక 65 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతుంది. రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందని కవిత తెలిపారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నారు. గత పాలకులు బీడీ కార్మికుల ఓట్లు అడిగారు కానీ పెన్షన్లు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్క రాయికల్ మండలంలోనే 16700 మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నాం. చేసిన పనిని చెప్పాలి. చేయాల్సిన పనిని బాధ్యతతో చేయించాలని కార్యకర్తలకు కవిత సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏనాడూ కూడా విశ్వాసం కోల్పోలేదు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉందన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా విప్లవం సృష్టించాలని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టిస్తదని విశ్వాసం ఉందన్నారు. అనుకున్న లక్ష్యం సాధించే వరకు నిలబడే నాయకుడే నిజమైన నాయకుడు అని కవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..