భారత్ జోడో యాత్రలో సోనియా

103
sonia
- Advertisement -

ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. అక్టోబర్ 6వ తేదీన కర్ణాటకలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు సోనియా. రాహుల్ గాంధీ కర్ణాటకలో 511 కి.మీ ప్రయాణించనుండగా సోనియా యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి.

రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు.. సోనియా మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లారు. ఈ యాత్ర భాగంగా రాహుల్ గాంధీ వివిధ గ్రామాలను సందర్శిస్తూ ప్రజల కష్టాల గురించి తెలుసుకుంటున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 30న తమిళనాడులోని గుడ్లూరు నుంచి కర్ణాటకలోని గుండ్లుపేటకు చేరుకుంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యాత్రకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలాంటి యాత్ర జరగడం ఇదే తొలిసారి.

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో యాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ ప్రయాణం మొత్తం 3570 కి.మీ సాగనుంది.

- Advertisement -