- Advertisement -
కృష్ణంరాజు తనకు ఆత్మీయ మిత్రుడని తెలిపారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
1998లో కృష్ణంరాజును తొలిసారి కలిశాను. అప్పుడాయన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యాను అని తెలిపారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా.. నన్ను అన్నగారు అని పిలిచేవారని తెలిపారు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండేవారన్నారు. కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను అని చెప్పారు.
- Advertisement -