- Advertisement -
ఆగస్టు 22 సందర్భంగా గాడ్ ఫాదర్ చిరంజీవి అభిమానులకు మెగా ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మెహన్ రాజా దర్శకత్వంలో మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలుపెట్టగా ఇటీవలె ముంబై షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ – చిరు మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందుకు సంబంధించి వీడియోని చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోండగా, సత్యదేవ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
- Advertisement -