దసరా బరిలో బాలయ్య 107!

73
- Advertisement -

అఖండ హిట్‌తో మంచి జోష్‌మీదున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన బాలయ్య లుక్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య డైలాగ్‌లు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడట. అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా షూటింగ్‌లు ఆగిపోయినా, బాలయ్య తన సినిమా షూటింగ్‌ను విదేశాల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట బాలయ్య.

ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

- Advertisement -