చిరు 157కి ఆసక్తికర టైటిల్!

43
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అడ్వెంచరస్‌ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార, అనుష్క, మృణాళ్‌ ఠాకూర్‌ వంటి వారి పేర్లు పరిశీలిస్తున్నా నయన్‌నే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

త్వరలో ఫస్ట్ షెడ్యూల్‌ ప్రారంభం కానుండగా మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారట. ఇక ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. గతంలో చిరంజీవి హీరోగా జగదేకవీరుడు అతిలోక సుందరితో ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్‌ని కొట్టారు. చిరు పాత్ర ఆడియన్స్ మనసులో గుర్తుండిపోయేలా జగదేకవీరుడుడ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఉండనుంద. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు.

Also Read:ట్రెండింగ్‌లో టైగర్ నాగేశ్వరరావు…థర్డ్ సింగిల్

- Advertisement -