- Advertisement -
దేశంలో పేదరికం పోయి స్వాతంత్ర్య ఫలాలు అందరికి అందాలన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. పిల్లల మధ్య స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకోవడం గొప్ప అవకాశమని చెప్పారు. ఆంగ్లేయుల పాలనలో దేశం, ప్రజలు బానిసలుగా బతికారని, వారి నుంచి స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధులు అనేకమంది పోరాటం చేసి 2 వందల ఏండ్ల పరాయి పాలన నుంచి మనకు విముక్తి కల్పించారని చెప్పారు.
నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు వారి త్యాగఫలమని వెల్లడించారు. నేటి తరం పిల్లలకు స్వాతంత్య్రం అంటే ఏమిటనే విషయంపై అవగాహన ఉండాలని సూచించారు.
- Advertisement -