ఆయిల్ ఫామ్‌పై రైతులు దృష్టిసారించాలన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును పరిశీలించిన ఐకే రెడ్డి…పంటను రైతులు ఆయిల్ పామ్ గింజలను ఫ్యాక్టరీకి ఎలా తరలిస్తున్నారు? తీసుకు వచ్చిన ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? టన్నుకు నూనె దిగుబడి ఎంత వస్తుంది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మొక్కలను ఎలా పెంచుతున్నారు ? సాగులో ఎటువంటి పద్ధతులు పాటించాలి ? ఎటువంటి ఎరువులను వాడాలి ? ఆయిల్ పామ్ దిగుబడి సంవత్సరంలో ఏ నెలల్లో అధికంగా వస్తుంది ? అని సంబంధిత అధికారులు, నర్సరీ నిర్వాహకులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్‌ల్ పంటలు వేయాలని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వచ్చే జూన్ తర్వాత 3 లక్షల ఎకరాలలో సాగు చేసేందుకు రైతులకు మొక్కలు సిద్ధంగా ఉంచారన్నారు.