ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు కేబినెట్ సబ్‌కమిటీ..

182
Harishrao
- Advertisement -

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్’ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం….క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సబ్ కమిటీలో.. వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు చైర్మన్ గా .. అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి కె.టి.ఆర్., పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు సభ్యులుగా ఉన్నారు.

కరోనా నుంచి ఒమిక్రాన్’’ పేరుతో కొత్త వేరియంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్ కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితి ని తెలిపారు. నివేదిక సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. అన్ని రకాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు.

రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్దంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది

- Advertisement -