వ్యవసాయంపై కమిటీ: తోమర్

135
tomar
- Advertisement -

వ్యవసాయ రంగంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, కనీస మద్ధతు ధరలో పారదర్శకత అంశాలపై కమిటీ పనిచేస్తుందని తెలిపారు.

ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని…ఈ చర్యతో రైతుల కనీస మద్ధతు ధర డిమాండ్ కూడా నెరవేరిందని తెలిపారు.

మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పార్లమెంట్ సమావేశాల తొలిరోజే చట్టాలను రద్దు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -