ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం

122
sathyavathi
- Advertisement -

దేశానికి అన్నం పెట్టే రైతన్న వెన్నెముకను విరగొట్టే విధంగా, వ్యవసాయాన్ని విధ్వంసం చేసే విధంగా బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలపై రైతులు అలుపెరగక చేసిన పోరాట ఫలితం, రైతు సాధించిన విజయం ఈ నల్ల చట్టాల రద్దు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు.

ఈ చట్టాల వల్ల రైతుకు తీరని నష్టం ఉంటుందని, వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారని, చట్టాల రద్దు కోసం ఉద్యమాలు, ధర్నాలు చేశారని, ఫలితంగా కేంద్రం ఈ చట్టాలను ఈరోజు రద్దు చేయడం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి రైతు మద్దతు పోరాటల విజయమని తెలిపారు.

ఈ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుకు బాసటగా నిలిచి రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ ద్వారా పుష్కలమైన సాగునీరు, ఎరువుల లభ్యత, నకిలీ విత్తనాలు అమ్మకుండా పి.డి యాక్టు తీసుకురావడం, వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం, రైతువేదికలు, రైతు కల్లాలు నిర్మించడం వంటి అనేక రైతుసంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండగ చేసి, రైతును రాజు చేశారని, తెలంగాణను దేశానికి అనతికాలంలోనే అన్నపూర్ణగా మార్చారన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అనునిత్యం ఆలోచించి బీళ్లు పారిన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పొలాలతో పచ్చలహారంగా మారిస్తే…బిజెపి ప్రభుత్వం రైతుల నడ్డివిరుస్తూ, వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతూ తెచ్చిన చట్టాలతో రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. అన్నదాతలు అలుపులేని పోరాటాలు చేసి పంజాబ్ కేంద్రంగా గురునానక్ జయంతి రోజున నల్లచట్టాలను రద్దు చేయించడంలో విజయవంతమైన సందర్భంగా దేశ రైతులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

దేశానికి రైతు అన్నం పెట్టడమే కాదు… ఆ రైతన్నను దెబ్బతీసే విధంగా ఏ ప్రభుత్వం పనిచేస్తే వారికి బుద్ది చెప్పడానికి కూడా ఆరుగాలం కష్టపడినట్లే అలుపెరగక పోరాడుతాడని, విజయం సాధిస్తాడని నిరూపించిన రోజని, దేశ ప్రజలకు, రైతులకు ఇది గర్వకారణమైన రోజని, బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై విజయం సాధించి సంబరాలు చేసుకునే రోజని అన్నారు.

తెలంగాణలో కూడా రైతుకు మేలు జరిగి, రైతు పండించిన పంటకు న్యాయం జరిగే విధంగా, రైతు ముఖంలో చిరునవ్వు కలకాలం కొనసాగే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చేస్తున్న పోరాటం కూడా కచ్చితంగా ఫలిస్తుందని, ఇది రైతుల పోరాటమని, బిజెపి ఇకనైన రైతు వ్యతిరేక విధానాలను, ఆలోచనలను మానుకుని ఈ దేశ అన్నదాతకు అండగా ఉండాలని, కేసిఆర్ రైతుబంధు విధానాలను అభినందించాలని, అనుసరించాలని సూచించారు.

- Advertisement -